సామాజిక మాధ్యమం వాట్సాప్‌కున్న స్థానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియా గురించి ఈరోజుల్లో తెలియని వాళ్ళు, వాట్సాప్ గురించి తెలుసుకోనివాళ్ళు అమాయకుల కిందే కాదు అసలు ప్రపంచంలో ఏమీ ఎరుగని వారి కిందే లెక్క. ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించడం అనేది ఇప్పుడు ఒక గౌరవంగా మారింది. కాలంతోపాటు అప్డేట్గా ఉన్నట్టు లెక్క అంటే వాట్స్ యాప్ వినియోగించేవాళ్లే. దీంతో పలు సరికొత్త ఫీచర్లతో నిండిన వాట్సాప్ లేటెస్టు వర్షన్ ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
సాధారణంగా ఫోన్‌బుక్‌లో లేని నంబర్లకు వాట్సప్చేయమని ఎవరైనా అడిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ పలానా నెంబర్‌ను కాంటాక్ట్‌లో సేవ్ చేస్తేనే వాట్సాప్ జాబితాలో చేరుతుంది. అదీ కూడా త్వరగా స్క్రీన్‌లో కనిపించదు. ఏ 10 నిమిషాలకో లేదా అరగంట వరకు గాని తీసుకుంటుంది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరికింది. క్షణాల్లో వాట్సాప్ జాబితాలో చేరేలా కొత్త బీటా వర్షన్‌ను విడుదలచేసింది. 2.16.248 వర్షన్‌తో ఇలా ఫోన్‌బుక్‌లో సేవ్‌చేసిన వెంటనే వాట్సాప్‌లో అప్డేట్ అవడం దీనికున్న ప్రత్యేకత.