భారత్‌లో టిక్‌టాక్ వదిలి వెళ్లిన షార్ట్ వీడియోల మార్కెట్‌ను కైవసం చేసేందుకు అనేక కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే 'రీల్స్' పేరిట ఇన్‌స్టాలో షార్ట్ వీడియోలను ప్రవేశపెట్టిన ఫేస్‌బుక్.. టిక్‌టాక్ యూజర్లను అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే యూట్యూబ్ కూడా ఈ మార్కెట్‌లో వాటాకోసం ప్రయత్నిస్తోంది. షార్ట్ వీడియో ఫార్మాట్‌కు మంచి డిమాండ్ ఉన్న భారత్‌లో యూట్యూబ్ ఇప్పటికే 'షార్ట్స్' పేరిట కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.