మేడిపండు జూడ..!

శుక్రవారం, 10 అక్టోబరు 2008 (11:22 IST)
FileFILE
మేడిపండు చూడ మేలిమై యుండు
పొట్టవిప్పి చూడ పురుగులుండు
బిరికి వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ..! వినుర వేమ..!

తాత్పర్యం :
మేడిపండు పై భాగాన్ని చూస్తే... మంచి రంగుతో నోరూరించేలాగా కనిపిస్తుంది. కాని దాని పొట్టను విడదీసి చూస్తే లోపల పురుగులుంటాయి. అలాగే పిరికి వాడి ధైర్యం కూడా పైన పటారం లోన లొటారం లాగా ఉంటుందని ఈ పద్యం యొక్క భావం.

వెబ్దునియా పై చదవండి