సాధారణంగా వామపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు నిరాడంబరతకు మారుపేరు. పేరుకు అధికారంలో ఉన్నప్పటికీ.. ఆ దర్పాన్ని ఎక్కడా ప్రదర్శించరు. పార్టీ నిబంధనలను ఏమాత్రం ఉల్లఘించరు. దీంతో పాటు.. వ్యక్తిగత క్రమశిక్షణలో ముందువరుసలో ఉంటారు. ఎంత పెద్ద పదవిలో ఉన్నా తామూ ప్రజల్లో భాగమన్న అభిప్రాయం వారిలో బలంగా ఉంటుంది. దీనికి ఉదాహరణ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.