'నేను సన్యాసిని. మీ ఇంటికి వచ్చా.. మీ ఇంటి గడప దగ్గరున్న.. భిక్షం అడుగుతున్నా.. మీరు సన్యాసిని నిరాకరిస్తే.. మీ కుటుంబ సుఖ సంతోషాలను నేను తీసేసుకుంటాను (సంతోషాలు లేకుండా చేస్తా) మిమ్మల్ని శపిస్తా' అంటూ సాక్షి మహారాజ్ అన్నారు. అంతేకాకుండా పురాణాల్లో ఉన్న అనేక అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఓటర్లను ప్రభావితం చేస్తూ భయపెట్టే ప్రయత్నం చేశారని ఓ ప్రముఖ పత్రిక వార్తా కథనాన్ని రాసింది.
నేను సన్యాసిని.. మీరు గెలిపిస్తే.. నేను గెలుస్తా.. లేకుంటే గుళ్లో నేను భజన చేసుకుంటా లేదా కీర్తనలు పాడుకుంటూ ఉంటా..అయితే ఇవాళ నేను ఓట్ల కోసం మీ దగ్గరకు వచ్చాను. మీ ఇంటి గడప దగ్గరకు వచ్చి ఓట్లు అడుగుతున్నాను. సన్యాసిని మీరు నిరాకరిస్తే... మీ కుటుంబ సుఖసంతోషాలను నేను తీసేసుకుంటాను. మిమ్మల్ని శపిస్తానని సాక్షి మహారాజ్ ఓటర్లను బెదరించారు.