మహాశివుడిని పూజించే ముందు వినాయకుడిని పూజించాలి. అంటే నీళ్లు, పాలు వంటి వాటిని ముందు వినాయకుడి విగ్రహానికి సమర్పించిన తర్వాత మరో దేవుళ్లకు ఉపయోగించాలి. ఎలాంటి పూజ చేసినా.. ముందుగా వినాయకుడిని పూజించాలనే స్వయంగా శివుడే వివరించాడు. తులసి ఆకులను ఎట్టిపరిస్థితుల్లో శివుడికి సమర్పించరాదు.
నైవేద్యంగాకొబ్బరికాయ శివుడికి ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. శివలింగం ముందు కొబ్బరికాయ కొట్టి.. ఆ నీటిని లింగంపై ధారగా పోయాలి. కొబ్బరి ముక్కలను నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఎండు ద్రాక్ష, అరటిపండ్లు, ఖర్జూరాలు శివుడికి ఇష్టమైన నైవేద్యంగా చెబుతారు. ఈ నైవేద్యాలు శివుడికి సమర్పించడం ద్వారా సకల సుఖ, సంతోషాలు కలుగుతాయని విశ్వాసం.