మామిడికాయ పులిహార ఎలా చేయాలి?

FILE
మామిడికాయ సీజన్ అయిపోయినప్పటికీ మామిడి కాయ ఎక్కడైనా మార్కెట్లో పట్టుకొచ్చేసారా.. అయితే వెంటనే మామిడికాయ పులిహార ట్రై చేయండి.

కావలసిన పదార్థాలు:
సన్న బియ్యం - ఒక కేజీ.
మామిడికాయ - 1.
ఆవాలు - తాలింపుకు సరిపడా
నూనె - తగినంత
ఎండుమిర్చి - 50 గ్రా.
పచ్చిమిర్చి - 50 గ్రా.
శనగపప్పు - 50 గ్రా.
మినపప్పు - 50 గ్రా.
కరివేపాకు - 3 రెబ్బలు.
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత.

తయారీ విధానం:
ముందుగా పుల్లని మామిడికాయని శుభ్రపరచి - తురుముకోవాలి. అన్నం వార్చి బేసిన్‌లో పోసి, పసుపూ, నూనెవేసి కలపాలి. చల్లారాక మామిడి తురుమూ ఉప్పూ వేసి కలపాలి. చివరలో నూనె మరిగించి తాలింపుగింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేయించి తిరగమోత పెట్టుకుంటే.. మామిడి పులిహార రెడీ అయినట్లే.

వెబ్దునియా పై చదవండి