మహిళల్లో సంతానలేమికి కారణాలు ఏంటి?

బుధవారం, 21 ఆగస్టు 2013 (16:54 IST)
FILE
ముఖ్యంగా మహిళల్లో సంతానలేమికి కారణం వారి వయస్సు. స్త్రీకి 32 ఏళ్లు దాటాక అండాశయం సామర్థ్యం ప్రతి ఏడాదికి తగ్గతూ పోతుంది. దానివల్ల కూడా సంతాన లేమి కలగవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

మహిళల్లో నెలసరి రావడం అన్నది వారి హర్మోన్ల వల్ల జరుగుతుంది. అలాగే రక్తస్రావం జరగడం అన్నది గర్భాశయపు లోపల పొర మందంపైన ఆధారపడి ఉంటుంది. నెలసరి సరిగా ఉండి, రక్తస్రావం సరిగా ఉన్నా... అండం సరిగా ఎదగపోవడం లేదా సరిగా విడుదలకాకపోవడం జరిగినా సంతానం కలగదని వారు చెబుతున్నారు.

అధిక బరువు కలిగిఉండటం కూడా పరోక్షంగా సంతాన లేమికి కారణం కావచ్చు. పైన పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని, దాన్ని చక్కదిద్దితే వాళ్లకు సంతానం కలిగే అవకాశం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి