టెన్షన్‌ను తగ్గించుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

FILE
ఇదేంటి..? టెన్షన్ తగ్గడానికి ఆహారం ఉందా.. అనుకుంటున్నారా.. అవునండి టెన్షన్‌ను దూరం చేసుకోవాలంటే మీ ఆహారంలోనూ కొన్ని మార్పులు అవసరమని న్యూట్రీషన్లు అంటున్నారు.

ముఖ్యంగా ఒబిసిటికి చెక్ పెట్టాలంటే ఏ ఆకుకూరల్లోనైనా వెల్లుల్లిపాయను చేర్చి వేపుకుని తీసుకోవచ్చు. ఇలా చేస్తే టెన్షన్‌కు ప్రధాన కారణమైన ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు.

అలాగే రక్తహీనత కారణంగా టెన్షన్ ఏర్పడవచ్చు. ఇందుకు ఏం చేయాలంటే.. కాస్త వేపాకును నమిలి నీటిని తాగడాన్ని అలవాటు చేసుకుంటే సరిపోతుంది.

ఇంకా వేపాకుతో కషాయం పెట్టి తాగితే టెన్షన్, తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. ఇంకా వెల్లుల్లి, ఉల్లిపాయలను నేతిలో వేపి తింటూ వుంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

బిల్వ ఆకులను రోజుకి రెండేసి నమిలి కాస్త తేనెను రుచిచూస్తే.. మానసిక ఒత్తిడి. హృద్రోగ సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఇక రాత్రిపూట అరటిపండ్లు తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెంపొందింపజేసుకోవచ్చు. ఇవన్నీ ఫాలో చేస్తే మీరు కూడా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చునని న్యూట్రీషన్లు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి