మూలవ్యాధికి గరిక రసంతో విరుగుడు

మంగళవారం, 2 జులై 2013 (17:05 IST)
FILE
గరిక దేవతార్చనలో, ముఖ్యంగా గణపతిపూజలో ఉపయోగించే అష్టమంగళ ద్రవ్యాలలో ఒకటి. గరిక ఉన్నచోట నీరు తప్పకుండా ఉంటుంది. అందుకే నీళ్ళున్న చోటును వెదకడంలో (జలపరిశోధన) ముందుగా గరిక ఉన్నచోటుకు ప్రాధాన్యతనిస్తారు.

కత్తిరించేకొద్దీ చిగురించడం దీని విశేషం. గరిక ప్రాణశక్తికి రక్షణ కలుగజేస్తుంది. దీనిలో ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. కాలిన గాయాలపై గరిక రసానికి కొద్దిగా కొబ్బరినూనె చేర్చి పూస్తే త్వరగా మానిపోతాయి. మూలవ్యాధి వున్నవారు రోజుకు 2 లేదా 3 సార్లు మూడు చెంచాల చొప్పున గరిక రసాన్ని తాగాలి.

వెబ్దునియా పై చదవండి