పసుపులో ఔషధగుణాలు మెండు...హెల్దీ ఆరోగ్యం కోసం!

శనివారం, 17 ఆగస్టు 2013 (17:10 IST)
FILE
పసుపు ఔషధగుణాలు మెండుగా ఉన్నాయి. అందుకని దీన్ని రోజూ తినే ఆహారంలో చేరిస్తే ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో లాభాలు పొందొచ్చు.

* పసుపు క్యాలీఫ్లవర్‌తో కలిపి తింటే ప్రొస్టేట్ క్యాన్సర్ దరిచేరదు. పాలు, పసుపు, తేనే కలిపి తీసుకుంటే జలుబు మాయం. పసుపులో నిమ్మరసం కలిపి వాపులు, బెణుకులు ఉన్న దగ్గర రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే పసుపు, వేప పొడిని సమ భాగాల్లో కలిపి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఒక టీ స్పూన్ చొప్పున తీసుకుంటే అన్ని రకాల చర్మ వ్యాధులు మాయమవుతాయి.

* మూత్ర సంబంధిత సమస్యలు పోవాలంటే ప్రతిరోజూ ఉసిరి, పసుపుల డికాక్షన్ తాగాలి. చిటికెడు పసుపును గ్లాసు నీళ్లలో కలుపుకుని తాగితే కామెర్లు రాకుండా నిరోధించొచ్చు. ఏ నొప్పినుండైనా ఉపశమనం పొందాలంటే గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి.

వెబ్దునియా పై చదవండి