ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రేమికుడు లేక ప్రేమికురాలు ఎవరైనా ఉన్నారా అంటే అది మీరే ఎందుకు కాకూడదు. కాని చాలా మంది తమ ప్రేమ విఫలం చెందితే మీ ప్రియుడు/ప్రియురాలిపై ద్వేషం వెళ్ళగక్కుతుంటారు. ఇలాంటి వారు ఆదర్శ ప్రేమికుల జాబితాలోకి రారు. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే...క్రింద పేర్కొనబడిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే మీరు ఎలాంటి ప్రేమికులో తెలిసిపోతుంది. దీంతో మీరు ఆదర్శవంతమైన ప్రియుడు/ప్రియురాలో మీకే తెలుస్తుంది.
1* మీరు ప్రేమ, పెళ్ళి రెండు వేర్వేరని భావిస్తున్నారా? అ* అవును. ఆ* కాదు. ఇ* అవసరం మేరకు అవును, కాదు. ఈ* తెలియదు.
2* మీ దృష్టిలో ప్రేమకు వయసంటూ ఉందా? అంటే మీరు మీ జీవితంలో స్థిరపడ్డాక ప్రేమించాలనుకుంటారా? అ* అవును. ఆ* ప్రేమ ఎప్పుడు పుడుతుందో అప్పుడు ప్రేమించడమే. ఇ* తల్లిదండ్రులు అనుమతించినప్పుడే. ఈ* తెలియదు.
3* మీ ప్రియుడు/ప్రియురాలు మిమ్మల్ని మోసం చేస్తున్నారని తెలిసి కూడా వారిని ప్రేమిస్తుంటారా?
FILE
అ* అస్సలు ప్రేమించను. ఆ* మీ ప్రేమపై నాకు నమ్మకం కలగడం లేదని...మీరు ప్రేమించే వ్యక్తికి కచ్చితంగా తెలపాలనుకుంటారా! ఇ* సమయం కోసం వేచి చూస్తారా! ఈ* ఈ విషయం గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు.
4* మీ ప్రియుడు/ప్రియురాలు ఏదైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ, ఇంట్లోనే ఎక్కువ కాలం గడుపుతుంటే మీరు మీ ప్రియుడు/ప్రియురాలుతో- అ* అవకాశం లభించినప్పుడు గంటలకొద్ది మాట్లాడుకుంటాం. ఆ* బయట కాసేపు తిరిగేందుకు రమ్మంటాను. ఇ* పోటీ పరీక్షల విలువను తెలుసుకుని వారికి మరింత ప్రోత్సాహమిస్తూ డిస్ట్రబ్ చేయను. ఈ* దీని గురించి పెద్దగా ఆలోచించను.
FILE
5* మీ పుట్టిన రోజు పార్టీలో మీ ప్రియుడు/ప్రియురాలు సాధారణమైన బహుమతిని తీసుకువస్తే మీరు- అ* మీ తోటివారి మధ్య అవమానంగా భావిస్తారా. ఆ* వారు తెచ్చిన బహుమతితో అయిష్టంగా ఉంటారా. ఇ* ప్రియుడు/ప్రియురాలు తెచ్చిన బహుమతికి విలువకట్టడం ప్రేమ ముందు అంత మంచిది కాదు. ఈ* నా అదృష్టానికి బాధపడుతాను.
6* మీ ప్రియుడు/ప్రియురాలు మీ తోటివారితో కలిసి-మెలిసి తిరుగాడుతుంటే- అ* మీకు నచ్చదు. ఆ* వారిని కలవవద్దని ఖచ్చితంగా చెపుతాను. ఇ* ప్రియుడు/ప్రియురాలిపై నమ్మకం ఉంచుకుంటాను. ఈ* ప్రియుడు/ప్రియురాలితో సంబంధాన్ని తెంచుకుంటాను.
7* మీ దృష్టిలో ప్రేమ అనేది ఓ వయసులోనే జరగాలని భావిస్తారా
FILE
అ* అవును ఆ* పలువురిపై పలు రకాల అభిప్రాయం ఉంటుంది. ఇ* ప్రేమ అనే ఫీలింగ్ కలిగినప్పుడే. ఈ* తెలియదు.
సంగ్రహం : ఇందులో ప్రతి ప్రశ్నకు నాలుగు సమాధానాలు ఇవ్వడం జరిగింది. నాలుగింటిలో ఒక సమాధానానికి 5 మార్కులు ఇవ్వడం జరిగింది. మిగిలిన వాటికి సున్న మార్కులు. ఇందులో మీరు గనక 30 నుంచి 35 మార్కులను పొందితే మీరే నిజమైన ఆదర్శవంతమైన ప్రేమికులు. ఒకవేళ మీకు 20 నుంచి 25 మార్కులు వస్తే మీ ప్రేమ స్థిరంగా ఉన్నట్లే లెక్క. కాని మీకు 15 మార్కులకన్నా తక్కువ వస్తే మీరు ఆదర్శవంతమైన ప్రేమికులు కాదు. సమాధానాలు : 1. ఆ, 2. ఆ, 3. ఇ, 4. ఇ, 5. ఇ, 6. ఇ, 7. ఇ. మీ ప్రేమ ఎంత ఆదర్శవంతమైనదో తెలుసుకోండి.