ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ క్రమంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అంతకుముందు రాజ్ కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డి కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. ఇవాళ వైసీపీ నేత, ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు.
లిక్కర్ కేసులో విచారణకు హాజరుకాకుండా ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. సిట్ అధికారుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఎట్టకేలకు విజయవాడలోని సీపీ కార్యాలయంలో సిట్ అధికారుల ఎదుట మిథున్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.