హైదరాబాద్ నగరంలో ఉగ్ర కదలికలు - 16 మంది అరెస్టు?

మంగళవారం, 9 మే 2023 (16:52 IST)
హైదరాబాద్ నగరంలో ఉగ్ర కదలికలు ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో రంగంలోకి మధ్యప్రదేశ్ పోలీసులు 16 మంది అనుమానితులను అరెస్టు చేశారు. వీరిలో భోపాల్‌కు చెందిన 11 మంది, హైదరాబాద్ నగరానికి చెందిన ఐదుగురు నిందితులు ఉన్నారు. వీరందరినీ హైదరాబాద్ నగరంలో అదుపులోకి తీసుకుని మధ్యప్రదేశ్‌కు తరలిస్తున్నారు. 
 
నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, సాహిత్యం, కత్తులు, ఎలక్ట్రానిక్ డివైస్‌, డ్రాగన్‌లు స్వాధీనం చేరుకున్నారు. అంతేకాకుండా, ఇస్లామిక్ జిహాదీని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా 18 నెలల నుంచి హైదరాబాద్ నగరంలో మకాం వేసివుంటున్నారు. యువతను ఉగ్రవాదం వైపు వీరు మళ్లిస్తున్నట్టు సమాచారం. వీరి వద్ద విచారణ జరిపితే మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ఎన్.ఐ.ఏ అధికారులు తెలిపారు. 
 
మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన పోలీసులు హైదరాబాద్ నగరంలో ఏకంగా 16 మంది ఉగ్ర అనుమానితులను అరెస్టు చేయడం భాగ్యనగరిలో కలకలం రేపింది. దీంతో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. అలాగే, ప్రజలను సైతం అలెర్ట్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఉగ్ర కదలికల నేపథ్యంలో లుంబిని పార్క్, దిల్‌షుఖ్ నగర్, గోకుల్ చాట్, చార్మినార్ వంటి ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు