కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. పార్టీల గోల మాత్రం తగ్గట్లేదు. కరోనా నియంత్రణకు సర్కారు విధించిన నిబంధనలను అధిగమించి.. 300మంది అర్థరాత్రి ఓ పార్టీకి హాజరయ్యారు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో కలకలం సృష్టించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఓ ప్రైవేట్ రిసోర్ట్ మేనేజర్‌తో పాటు మరో ఐదుగురిని అరెస్ట్ చేశారు.
జూన్ 29 రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 2 గంటల వరకు ఈ పార్టీ జరిగిందన్నారు. ఈ పార్టీలో బెల్లీ డ్యాన్స్ వంటివి చోటుచేసుకున్నాయని, ఇందులో డ్యాన్స్ చేసిన డ్యాన్సర్‌ను పక్క రాష్ట్రం నుంచి రప్పించినట్లు తెలిసింది. మత పెద్దలు, రాజకీయ నాయకులు, సినీ తారలు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతస్థాయి అధికారులు పార్టీకి హాజరయ్యారు.