ఏది నిజం? హెర్బల్ మైసూర్‌పాక్‌తో కరోనా చెక్? (video)

బుధవారం, 8 జులై 2020 (09:35 IST)
ప్రపంచం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కి కొట్టుమిట్టాడుతోంది. ఈ వైరస్ అంతానికి ప్రపంచ దేశాలన్నీ పరిశోధనల్లో నిమగ్నమైవున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు, చిన్నియం పాళయంలోని ఓ స్వీట్ షాపు మాత్రం కొత్త ఫార్ములాతో తెరపైకి వచ్చింది. 
 
రోజు ఒకటి 'హెర్బల్ మైసూర్‌పాక్' తినడం ద్వారా కోవిడ్ నుంచి సురక్షితంగా బయటపడొచ్చని ఏకంగా బహిరంగ ప్రకటన కూడా ఇచ్చేసింది. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసముంటున్న వారి నుంచి కూడా చాలా మంచి స్పందన కూడా వస్తోందని ఆ షాపు ప్రకటించింది. 
 
కోవిడ్ లక్షణాలున్న వారందరూ ఉచితంగా పొందవచ్చని ఆ షాపు యాజమాన్యం పేర్కొంది. ఈ ‘హెర్బల్ మైసూర్ పాక్’ ఫార్ములాను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు కూడా తాము సిద్ధంగానే ఉన్నామని యజమానులు ప్రకటించారు కూడా. చిన్నియం పాళయం, వెల్లూరు ప్రాంతాల్లో ఈ ప్రచారం ఎంతకూ తగ్గకపోవడంతో ఆరోగ్య శాఖ అధికారులు రంగంలోకి దిగి, విచారణ ప్రారంభించారు.
 
ఈ విషయంపై ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రమేశ్ కుమార్ స్పందిస్తూ... ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఈ ప్రచారంతో ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించడమే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని తాము ఆహార భద్రతా శాఖ వారిని కోరినట్లు రమేశ్ తెలిపారు. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు