కేంద్ర ప్రభుత్వ డేటా ప్రకారం అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల జాబితాలో గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్ ఉన్నాయి. గుజరాత్‌లో 2,859 కేసులు, మహారాష్ట్రలో 2,770, ఏపీలో 768 కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 11,717 కేసులు నమోదయ్యాయి.
మ్యూకోర్మైకోసిస్ చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్లను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అందించింది. మహారాష్ట్ర, ఢిల్లీ, యుపీ, ఏపీ లలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సదరు రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్నాయి.
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు రాష్ట్రాలు యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్లను కేటాయించాలంటూ కేంద్రాన్ని కోరాయి. 29వేల 250 యాంఫోటెరిసిన్-బి వయల్స్ పలు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయిస్తూ మే 26న ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.