Flash Floods: జమ్ము-కాశ్మీర్‌లో వరదలు.. ఏడుగురు మృతి

బుధవారం, 28 జులై 2021 (16:14 IST)
జమ్ము-కాశ్మీర్‌లోని కిశ్త్వార్‌ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ వరదలకు హొంజార్ గ్రామంలో ఏడుగురు మృతి చెందారు. దాదాపు 30 మంది ఆచూకీ గల్లంతయిందని అధికారులు వెల్లడించారు. అలాగే ఈ ఘటనలో పలు ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైమానిక దళం సేవలు కూడా ఉపయోగించుకోనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు.
 
గత కొద్దిరోజులుగా జమ్ములోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెలాఖరు వరకు ఈ వానలు ఇలాగే కొనసాగుతాయన్న నివేదికల మధ్య.. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. వరదలు, కొండ చరియలు విరిగిపడే ముప్పు ఉన్న ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 
కిశ్త్వార్‌, కార్గిల్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితిని కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు కేంద్రం సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ప్రతిఒక్కరి క్షేమం కోసం ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. 
 
కేంద్రమంత్రి అమిత్‌ షా ఘటనా స్థలంలోని జరుగుతోన్న సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వాటిపై అధికారులతో సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు