బెంగుళూరులోని ఇందిరానగర్‌లో రహీమ్ అనే 18 యేళ్ళ కుర్రాడు 14 మంది అమ్మాయిలతో ప్రేమను ఎంజాయ్ చేస్తూ హాయిగా జీవితాన్ని గడిపేవాడు. అమ్మాయిలందరూ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైనవాళ్లే. ఇలాంటి సమయంలో ఒక అమ్మాయికి అనుమానం వచ్చింది. ఫోన్లో అతను వేర్వేరు అమ్మాయితో మాట్లాడుతున్నాడని తెలుసుకుని అతని ఫోన్‌ను చాటుగా చూసింది. అందులో తన నెంబర్ బార్బీ గర్ల్ 5 అని ఫీడ్ చేసి ఉంది. అలా బార్బీ గర్ల్ 14 నెంబర్లు ఉన్నాయి. రహీమ్‌కు కూడా తెలియకుండా 14 మంది నెంబర్లు తీసుకుంది. అందరికీ ఫోన్ చేసి మాట్లాడింది.