గత శాసన సభలోని నేర చరితులైన ఎమ్మెల్యేలతో పోల్చితే, ఈసారి 5 శాతం ఎక్కువ మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నట్లు వెల్లడైందని పేర్కొంది. 12 మంది కొత్త ఎమ్మెల్యేల అఫిడవిట్లు అందుబాటులో లేకపోవడంతో పరిశీలించలేకపోయినట్లు తెలిపింది.
ఇద్దరు ఎమ్మెల్యేలు హత్య కేసుల్లో, 11 మంది ఎమ్మెల్యేలు హత్యాయత్నం కేసుల్లో, నలుగురు ఎమ్మెల్యేలు కిడ్నాప్ కేసుల్లో నిందితులని పేర్కొంది. వీరిలో శివసేన, ఎన్‌సీపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు చొప్పున ఉన్నట్లు తెలిపింది.
బీజేపీ ఎమ్మెల్యేల్లో 40 మందిపైనా, శివసేన ఎమ్మెల్యేల్లో 26 మందిపైనా, ఎన్‌సీపీ ఎమ్మెల్యేల్లో 17 మందిపైనా, 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపైనా, స్వతంత్రుల్లో ఆరుగురిపైనా తీవ్ర నేరాలు విచారణలో ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక వెల్లడించింది.