జనాభా గణనకు సంబంధించి అన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. భారతదేశం 1881 నుండి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా గణనను నిర్వహిస్తోంది. ఈ దశాబ్దపు జనాభా గణనలో మొదటి దశ ఏప్రిల్ 1, 2020న ప్రారంభమవుతుందని భావించారు. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా వేయవలసి వచ్చింది.
కుల గణన నిర్వహించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో జనగణనపై అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. మొత్తం జనాభా లెక్కలు, ఎన్‌పిఆర్ కసరత్తుకు ప్రభుత్వానికి రూ.12,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.