దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ దహనం చేస్తుండగా.. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చారు. ఈ శబ్దాలకు రైల్వే ట్రాక్‌పై నిల్చున్నవారు తమపైకి రైళ్లు వస్తున్నట్టు గుర్తించలేకపోయారు. దీంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రైలు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిందని పంజాబ్ పోలీసులు భావిస్తున్నారు.
అధికార యంత్రాగం, దసరా కమిటీల నిర్వాకమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. రైలు వెళ్తున్నప్పుడు కనీసం అప్రమత్తం చేసి ఉంటే... ఇంతటి ఘోర ప్రమాదం జరిగి ఉండేది కాదంటున్నారు. ముందే అప్రమత్తం చేసి ఉంటే రైలు వేగం తగ్గి నిదానంగా వచ్చేదని వారన్నారు.