పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం.. భార్య జుట్టు కత్తిరించిన భర్త

గురువారం, 13 అక్టోబరు 2016 (11:30 IST)
వెస్ట్ బెంగాల్‌లో దారుణం చోటుచేసుకుంది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమె జుట్టును ఆమె భర్త చేత పంచాయతీ పెద్దలు కత్తిరింపజేశారు. ఈ ఘటన ముర్షీదాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే... ముర్షీదాబాద్ ప్రాంతానికి చెందిన పెళ్లయిన ఓ మహిళకు వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. 
 
దానిపై కులపెద్దలు పంచాయతీ పెట్టారు. విచారణలో ఆమె తప్పు చేసిందని తేలింది. దీంతో పంచాయితీ పెద్దలు పరిహారంగా రూ. 6 వేలు జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు. అయితే, ఆమె ఆ మొత్తాన్ని చెల్లించలేకపోయింది. దాంతో ఆమె భర్తను పిలిచి, అతడితోనే బలవంతంగా ఆమె జుట్టును మెడ వరకు కత్తిరింపజేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్రమంగా తీర్పునిచ్చిన ముగ్గురిని అరెస్టు చేశారు.
 

వెబ్దునియా పై చదవండి