15మందిని పొట్టనబెట్టుకున్న మదపుటేనుగు.. కాల్చి చంపేయాలని ఉత్తర్వులు..

ఆదివారం, 13 ఆగస్టు 2017 (11:00 IST)
బీహార్‌ రాష్ట్రంలో 25 ఏళ్ల ఏనుగు 15 మందిని చంపడంతో.. ఆ ఏనుగు కాల్చి చంపాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఏనుగు తల్లి నుంచి విడిపోవడంతో మదపుటేనుగు 15 మందిని హతమార్చింది. జార్ఖండ్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న 11 మంది ఈ ఏనుగు చేతిలో బలైపోయారు. 
 
ఈ ఏనుగును పట్టేందుకు అటవీ శాఖాధికారులు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనాయి. దీంతో ఆ ఏనుగును కాల్చి చంపేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏనుగును కాల్చి చంపేయాలని ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు