టీఎంసీలో చేరిన భార్యకు విడాకుల నోటీసు పంపిన బీజేపీ ఎంపీ!

బుధవారం, 23 డిశెంబరు 2020 (15:33 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ భార్య చేరారు. దీన్ని జీర్ణించుకోలేని భర్త... తన భార్యకు విడాకులు నోటీసులు పంపిస్తానని మీడియా ముఖంగా ప్రకటించారు. ఇపుడు అనుకున్నట్టుగానే ఆ నోటీసులు పంపించారు. 
 
టీఎంసీలో చేరిన ఎంపీ భార్య పేరు సుజాత మండల్ ఖాన్ కాగా, ఆమె భర్త సౌమిత్రా ఖాన్. భారతీయ జనతా పార్టీ తరపున పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తన భార్యకు విడాకుల నోటీసు పంపించినట్టు ఆయన తెలిపారు. 
 
సౌమిత్ర లాయ‌ర్ ప‌ర‌స్ప‌ర విడాకుల నోటీసు పంపిస్తూ.. విడాకులు ఎందుకు కోరుకోవాల్సి వ‌చ్చిందో.. వాటిని ఆ నోటీసులో ఉద‌హ‌రించారు. సుజాత‌తో ఉన్న ప‌దేళ్ల వైవాహిక జీవితానికి తెర దించుతున్న‌ట్లు సౌమిత్ర సోమ‌వారం సాయంత్రం ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. 
 
త‌న‌తో బంధం తెగిపోయిన త‌ర్వాత ఖాన్ అనే ప‌దాన్ని పేరు చివ‌ర‌లో తొల‌గించాల‌ని సుజాత‌కు సౌమిత్ర సూచించారు. రాజ‌కీయంగా ఆమెకు స్వేచ్ఛ‌ను ఇస్తున్నాన‌ని ఆయ‌న తెలిపారు. 2019లో తాను బీజేపీలో చేరిన త‌ర్వాత ఆమె త‌ల్లిదండ్రుల‌పై ఎవ‌రు దాడి చేశారో, ఆ విష‌యాన్ని గుర్తుంచుకోవాల‌ని సుజాత‌కు సౌమిత్ర సూచించారు. 
 
2019 లోక్‌సభ ఎన్నికల్లో తన భర్త గెలుపు కోసం తనపై దాడులు జరిగినా వెరవలేదని, అయినా తనకు సరైన గుర్తింపు రాలేదని సుజాత పేర్కొన్న విష‌యం తెలిసిందే. బీజేపీలో విధేయుల కంటే అయోగ్యులు, అవినీతిపరులకే ప్రాధాన్యం లభిస్తున్నదని విమర్శలు గుప్పిస్తూ టీఎంసీలో చేరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు