కోవిడ్ -19 నుంచి కోలుకున్న మధుమేహుల్లోనూ ఈ కేసులు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు బ్లాక్ ఫంగస్ కేసులను నిరోధించేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఢిల్లీతో పాటు కర్నాటక, ఉత్తరాఖండ్, ఏపీ, హర్యానా, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి.