ఇకపై ఎవరైనా వ్యక్తి ఐఆర్సీటీసీ ద్వారా రైల్వే టికెట్లను బుక్ చేయాలంటే.. ఆధార్, పాన్ కార్డు, పాస్‌పోర్ట్ వంటి ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.
భవిష్యత్తులో ఆధార్, పాన్, పాస్‌పోర్ట్ వంటి ధృవీకరణ పత్రాల వివరాలు ఇవ్వకుండా రైల్వే టికెట్లను కొనుగోలు చేయలేరు. ఏదో ఒక ప్రూఫ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఆ తర్వాతే టికెట్లను బుక్ చేయగలరు. దీని వల్ల రైల్వే టికెట్ల బుకింగ్స్‌లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టొచ్చు. మా భవిష్యత్ ప్లాన్ ఇది. ఇది దాదాపుగా పూర్తయింది.
2019వ సంవత్సరం నవంబర్ నెలలోనే దీనికి సంబంధించిన పనిని మొదలు పెట్టామని ఆయన వెల్లడించారు. 2021వ సంవత్సరం మే నెల వరకు టికెట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్న 14,257 మందిని అరెస్ట్ చేశామని చెప్పుకొచ్చారు. 28.34 కోట్ల రూపాయల విలువైన టికెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.