స్విగ్గి నూడుల్స్‌లో రక్తంతో కూడిన బ్యాండేజ్

మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (19:18 IST)
దేశంలో ఆన్‌లైన్ మార్కెటింగ్ జోరుగా సాగుతోంది. కిరాణా సరకుల మొదలుకుని.. తినే తిండి వరకు ప్రతి ఒక్కటీ ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. అలా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకునే వస్తువుల్లో వివిధ రకాల పురుగులు, బొద్దింకలు, బ్యాండేజ్‌లు ఇలా ఎన్నో రకాలైన వస్తువులు కనిపిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో ఆరగించే పదార్థాలు ఆర్డర్ ఇవ్వాలంటేనే భయపడిపోతున్నారు. 
 
మొన్నటికిమొన్న జొమాటో డెలివరీ బాయ్ ఫుడ్ పాకెట్స్ ఓపెన్ చేసి తింటున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇపుడు స్విగ్గిలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. చెన్నై‌కి చెందిన ఓ యువకుడు స్విగ్గీ ద్వారా 'చాప్ ఎన్‌స్టిక్స్' అనే చైనీస్ రెస్టారెంట్ నుండి చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేశాడు. 
 
ఆ ఫుడ్‌ డెలివరీ కాగానే లొట్టలేసుకుని ఆరగించేందుకు ప్యాక్ ఓపెన్ చేసి చూశాడు. ఆ నూడిల్స్‌లో రక్తంతో తడిచిన బ్యాండేజ్ (నాప్కిన్ వంటిది) కనిపించడంతో షాక్‌కు గురయ్యాడు. వెంటనే సంబంధిత రెస్టారెంట్‌కి ఫోన్ చేసి అడగగా యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన రాలేదు. స్విగ్గికి ఫిర్యాదు చేసినా ఫలితం లభించలేకుండా పోయిందని వాపోయాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు