స్విగ్గీ అంటే ఇప్పటివరకు ఫుడ్-డెలివరీ సర్వీసెస్‌ను అందిస్తున్న మొబైల్ ఆధారిత అప్లికేషన్ అని అందరికీ తెలుసు. ఇది ప్రస్తుతం 80కు పైగా భారతీయ నగరాల్లో సేవలు అందిస్తోంది. అయితే ఈ సంస్థ ఇకపై నిత్యవసర వస్తువులను కూడా డెలివరీ చేయనున్నట్లు మంగళవారం ప్రకటించింది.
బ్రిక్ అండ్ మోర్టార్ స్టోర్స్ నుండి నిత్యవసరాలలో పండ్లు, కూరగాయలు, చంటిబిడ్డల సంరక్షణ వస్తువులు మరియు ఆరోగ్య ఉత్పత్తులు మొదలైన వాటిని కూడా డెలివరీ చేయనున్నట్లు ప్రకటించింది. స్విగ్గీ స్టోర్స్ అనే పేరుతో మొబైల్ యాప్‌లో సరికొత్త సేవను ప్రారంభించనుంది.
ప్రస్తుతం ఆలిబాబా సంస్థ బిగ్ బాస్కెట్ వంటి సంస్థలకు వెన్ను దన్నుగా నిలుస్తూ ఈ వ్యాపారంలో ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం స్విగ్గీ కూడా ఆ కోవకు చేరనుంది. ఇకపై స్విగ్గీ ద్వారా కూడా నిత్యవసరాలు ఆర్డర్ చేసుకోవచ్చన్నమాట.