దేశంలో వేగంగా కరోనా.. 24 గంటల్లో 36మంది మృతి.. కేరళలో తగ్గుముఖం

సోమవారం, 20 ఏప్రియల్ 2020 (11:02 IST)
కరోనా ప్రజలను పొట్టనబెట్టుకుంటోంది. కరోనా వేగంగా విస్తరిస్తుంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1,553 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం.., 36 మంది మృతి చెందారు చెందారు. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 17,265కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న 2,546 మంది డిశ్చార్జ్‌ కాగా, 543 మంది మృతిచెందారని తెలిపింది. దేశంలో ప్రస్తుతం 14,175 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని పేర్కొంది.
 
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 4,203 కరోనా కేసులు నమోదు కాగా, 223 మంది మృతిచెందారు. ఆ తర్వాత ఢిల్లీలో 2,003, గుజరాత్‌లో 1,743, మధ్యప్రదేశ్‌లో 1,407, రాజస్థాన్‌లో 1,478 , తమిళనాడులో 1,477, ఉత్తరప్రదేశ్‌లో 1,084 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు కేరళలో 402 మందికి కరోనా సోకగా.. అందులో 270 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. మగ్గురు మృతిచెందారు.
 
ఇకపోతే.. కేరళలో మాత్రం కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కేరళలో కేసుల సంఖ్య తగ్గడంతో అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఆంక్షలను పరిమితంగా ఎత్తివేసింది. కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు నేటి నుంచి అనుమతి ఇచ్చింది. అయితే ఇందుకు సరి-బేసి విధానం అమలు చేస్తున్నది. రాష్ట్రాని నాలుగు జోన్ లుగా విభజించిన కేరళ ప్రభుత్వం. రెడ్‌, ఆరెంజ్‌ ఏ, ఆరెంజ్‌ బి, గ్రీన్‌ జోన్ లు విభజించి హాట్ స్పాట్‌ పరిధిలో లేని ప్రాంతాల్లో మాత్రమే వాహనాలకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు