కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు ప్రజలంతా వ్యాక్సిన్లు వేయించుకోవాలని ప్రభుత్వాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి దేశ ప్రజలందరికీ ఉచితంగా టీకాలు వేస్తామని ప్రకటించింది. అదేసమయంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో టీకాలు వేయించుకునేందుకు ఆసక్తి చూపనివారు ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లించి టీకాలు వేయించుకోవచ్చని తెలిపింది. పైగా, పైవేటు ఆస్పత్రుల్లో టీకాల ధరను కూడా నిర్ణయించింది.
తాజాగా నిర్దేశించిన రేట్ల ప్రకారం.. సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక డోసు ధర రూ.780, రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకా రేటు రూ.1,145, భారత్ బయోటెక్ కంపెనీ కొవాగ్జిన్ టీకా ధర రూ.1,410గా నిర్ణయించింది.