అయితే, ఆ అనుమతిపై స్టే విధించాలని, సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్స్‌లో పాల్గొనాల్సిన పిల్లలు తమకు తాము వాలంటీర్లుగా రిజిస్టర్ చేసుకుంటున్నారని ఆయన వ్యాజ్యంలో పేర్కొన్నారు.
మైనర్లయిన పిల్లలకు వ్యాక్సిన్ ప్రయోగాల వల్ల తలెత్తే పరిణామాలపై అవగాహన ఉండదని, అంతేగాక, ఈ విషయంలో వారి తల్లిదండ్రుల అంగీకారం కూడా ఆమోదయోగ్యం కాదని అభ్యంతరాలు తెలిపారు.
అయితే, ట్రయల్స్‌పై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరించింది. అలాగే, ప్రయోగాలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు డీసీజీఐకు నోటీసులు జారీ చేసింది. కాగా, మరో పది రోజుల్లో రెండు, మూడు దశల క్లినికల్ ట్రయల్స్ ప్రారంభంకానున్నాయి. 525 మందిపై ట్రయల్స్ నిర్వహించనున్నారు.