కోవిన్ డేటా లీక్ కాలేదంటున్న కేంద్రం...

సోమవారం, 12 జూన్ 2023 (18:26 IST)
కోవిన్ పోర్టల్ నుంచి కరోనా టీకాలు వేయించుకున్న దేశ పౌరుల డేటా లీకైనట్టు వార్తలు వస్తున్నాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కోవిన్ డేటా లీక్ కాలేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. కోవిన్ డేటా లీకైనట్టు వస్తున్న వార్తలు అవాస్తమని తెలిపింది. పోర్టల్‌లో సమాచారం అత్యంత గోప్యంగా ఉందని తెలిపింది. 
 
కోవిన్ పోర్టల్ సురక్షితమని, డేటా లీక్ కాలేదని స్పష్టం చేసింది. కోవిన్ డేటా లీకైనట్టు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. ఈ పోర్టల్‌లో సమాచారం అత్యంత గోప్యంగా ఉందని తెలిపింది. ఎలాంటి ఆధారం లేకుండా లీకైనట్టు ప్రచారం జరిగిందని తెలిపింది. ఈ మేరకు డేటా లీకైనట్టు జరుగుతున్న ప్రచారంపై నివేదిక అందించాలని సీఈఆర్‌టీని కేంద్రం కోరింది. 
 
డేటా లీక్ బాధితులు వీరేనా...
మరోవైపు, కరోనా సమయంలో వ్యాక్సిన్‌కు సంబంధించి కోవిన్ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ నుంచి భారీ ఎత్తున డేటా లీక్ అయింది. ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో భారతీయల ఆధార్, పాస్ పోర్ట్ వివరాలు, వ్యక్తిగత సమాచారం లీక్ అయింది. 
 
డేటా లీక్ అయిన బాధితుల్లో కేటీఆర్, కనిమొళి, పి.చిదంబరం, జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితర ప్రముఖులు ఉన్నారు. వ్యక్తుల పేర్లు, ఫోన్ నెంబర్లు, ఆధార్ తదితర వివరాలు టెలిగ్రామ్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఎంతో గోప్యంగా ఉండాల్సిన వ్యక్తిగత సమాచారం లీక్ కావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు