ఈ నెల 11వ తేదీన కవిత వద్ద సుమారు 8 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు... ఈ నెల 16న మరోసారి రావాలని అదేరోజు సమన్లు జారీచేశారు. అయితే, ఆ సమన్లను రద్దు చేయాలని కోరుతూ కవిత.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం ఆమె తరపున దాఖలైన పిటిషన్‌ను తక్షణం విచారణ జరిపేందుకు కోర్టు నిరాకరించింది.
ఈ నెల 24వ తేదీన విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం.. ఈ నెల 16న విచారణకు హాజరు కావడంపై ఎలాంటి నిర్ణయాన్ని వెల్లడించలేదు. పైగా, ఇదే అంశంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కవిత గురువారం మరోసారి ఆమె ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు.