ఈ వివరాలను పరిసీలిస్తే, మంగళవారం రాత్రి కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్ ఢిల్లీ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో బయల్దేరారు. తన పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. తలనొప్పిగా ఉందని తెలిపాడు. బీపీ లెవల్స్ కూడా పడిపోయాయి.
దీంతో అస్వస్థతకు గురైన ప్రయాణికుడిని కేంద్ర మంత్రి గమనించి తక్షణమే వైద్యం అందించాడు. గ్లూకోజ్ అందించడంతో సదరు ప్రయాణికుడు త్వరగా కోలుకున్నాడు. దీంతో ఇండిగో యాజమాన్యం కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా కేంద్ర మంత్రి డాక్టర్ భగవత్ కరాడ్‌పై ప్రశంసలు కురిపించారు.