బెంగుళూరులోని ఇందిరానగర్‌లోనే అనేక పాపులర్ పబ్స్, నైట్ క్లబ్‌లు, రెస్టారెంట్లు ఉన్నాయి. అయితే ఓ పబ్‌కు చెందిన యాజమానులు అక్కడకు వచ్చిన మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగారు. అసభ్యకర దుస్తులను వేసుకునేలా ప్రేరేపించారు. అసభ్యకర నృత్యాలు కూడా చేసే విధంగా ప్రోత్సహించారు.
ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీనిపై పబ్ మేనేజ్‌మెంట్‌పై జీవన్‌భీమా నగర్ పోలీసులు కేసును నమోదు చేశారు. పబ్‌పై కేసు వేసిన విషయాన్ని ఈస్ట్ బెంగుళూరు డిప్యూటీ పోలీసు కమీషనర్ అజయ్ హిలొరీ తెలిపారు. ఉద్యోగులు ఇప్పిస్తామంటూ ఈశాన్య రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి డ్యాన్స్‌బార్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.