సాధారణంగా మగవాళ్ళు ప్రతిరోజు తలస్నానం చేస్తుంటారు. కానీ ఆడవాళ్ళు మాత్రం వారానికి మూడుసార్లు మాత్రమే తలస్నానం చేస్తుంటారు. జుట్టు ఎక్కువగా ఉండడం వలన ఆడవారు తలస్నానం చేయరు అని మనం అనుకుంటాం. కానీ జ్యోతిష్యులు చెప్పిన విషయాలు బట్టి తలస్నానం కొన్నిరోజులు చేస్తే మంచిది. మిగిలిన రోజులు చేస్తే మంచిది కాదని చెబుతుంటారు.
ఆడవారు శుక్ర, బుధవారం మాత్రమే తలస్నానం చేయాలని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ రెండు రోజుల్లో తలస్నానం చేస్తే ఐశ్వర్యం, ఐదోతనం రెండూ మెండుగా ఉంటాయి. శని, ఆదివారాల్లో తలస్నానం చేస్తే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజుల్లో మంచి ఫలితాలున్నా అప్పుడప్పుడు అరిష్టాలు తప్పవంటున్నారు జ్యోతిష్యులు.
మగవాళ్ళు మాత్రం బుధ, శనివారాలు తలస్నానం చేస్తే మంచి ఫలితాలుంటాయి. మంగళవారం స్త్రీలు, పురుషులు తలస్నానం చేయకూడదు. అలా చేస్తే ఏ పని కలిసిరాకపోవడమే కాకుండా ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే అది మధ్యలోనే ఆగిపోతుంది. సోమవారం తలస్నానం చేస్తే తాపం పెరుగుతుంది. పుట్టినరోజు, పండుగల సమయంలో మంగళవారం వస్తే ఆ రోజు తలస్నానం చేయవచ్చును. కానీ మిగిలిన రోజుల్లో మంగళవారం తలస్నానం చేయకూడదు.