ఈ జిల్లాలో పెద్దలు కుదిర్చిన వివాహంలో భాగంగా అక్కడి సంప్రదాయ "జై మాల" వేడుకలో వరడుు, వధువు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వరుడు అమర్జీత్ వర్మ స్నేహితులు వధువు కుటుంబ సభ్యుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. దీంతో వధూవరుల కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన వరుడు.. దీనికి మరింతగా ఆజ్యం పోస్తూ వధువు కుటుంబం నుంచి కట్నాన్ని మరింతగా డిమాండ్ చేశారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోయింది.
ఈ వ్యవహారంపై పంచాయతీ పెద్దలు జోక్యం చేసుకుని ఇరు కుటుంబాల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆగ్రహించిన వధువు తరపు బంధువులు వరుడిని చెట్టుకు తాళ్లతో కట్టేశారు. దీనిపై వరుడు తరపు బంధువులు పోలీసులకు సమాచారం చేరవేయడంతో వారు అక్కడకు చేరుకుని తాళ్ళతో చెట్టుకు కట్టేసిన వరుడిని విడిపించారు. ఈ వ్యవహారంపై పోలీసులు ఇరు కుటుంబాల మధ్య విచారణ జరుపుతున్నారు.