కుటుంబంలోని తొమ్మిది మంది రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక ఆ వంశానికి వారసుడు అంటూ ఎవ్వరూ లేరు. ఇక లాభం లేదనుకున్న ఓ 66 ఆరేళ్ల మహిళ వారసుడి కోసం తల్లి అయ్యింది. లేటు వయస్సులో టెస్ట్ ట్యూబ్ విధానంలో సంతానం పొందింది. రోడ్డు ప్రమాదంలో కన్నకొడుకు కూడా ప్రాణాలు కోల్పోవడంతో వారసత్వం కోసం పడంటి బాబుకు జన్మనిచ్చింది.
వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన మధుబెన్ గహ్లెతా, శ్యామ్‌భాయ్ గహ్లెతాలు దంపతులకు చెందిన కుటుంబ సభ్యులు 2016లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కుమార్తె మినహా అందరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో మధుబెన్ దంపతులు విషాదంలో మునిగిపోయారు.