ఉన్నావ్ (యూపీ), కఠువా (జమ్మూకాశ్మీర్) ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నారు. ఇకపై 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదు. కేంద్ర మంత్రివర్గం శనివారం సమావేశమై ఇందుకు సంబంధించి ఓ ఆర్డినెన్స్‌ను తెచ్చే అంశాన్ని పరిశీలించి ఖరారు చేస్తుంది.
ఆర్డినెన్స్‌స్థానే తీసుకునిరాబోయే చట్టాన్ని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతారు. ఇన్నాళ్లూ మైనర్లను రేప్ చేస్తే విధించే కఠిన శిక్ష అత్యధికంగా జీవిత ఖైదు (14 ఏళ్లు)... అత్యల్పంగా ఏడేళ్లు. ఈ నేపథ్యంలో పోస్కో చట్టానికి సవరణ తేనున్నట్లు కేంద్రం శుక్రవారం అధికారికంగా సుప్రీంకోర్టుకు కూడా తెలియజేసింది.