తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, థానేలో రోడ్లు, ఫుట్‌పాత్‌లపై వీధి వ్యాపారులు కొందరు అక్రమంగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి పాదాచారులతో పాటు.. వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయంగా మారాయి. దీంతో ఈ దుకాణాలను ఖాళీ చేయించాలని థానే మునిసిపల్ కార్పొరేషన్ నిర్ణయించింది.
ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ డాక్టర్ విపిన్ శర్మ ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగారు. అధికారులతో కలిసి దుకాణాలు, తోపుడు బండ్లను ఖాళీ చేయిస్తున్నారు. ఘోడ్‌బందర్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఇలానే దుకాణాలు ఖాళీ చేయిస్తుండగా కూరగాయల వ్యాపారి అమర్జీత్ యాదవ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ కల్పితా పింపుల్‌పై కత్తితో దాడిచేశాడు.