నెల్లూరు జిల్లా గూడూరు దూర్జటి నగర్‌కు చెందిన పేల్లేటి గోవిందు రెండో కుమారుడు సురేష్ అదే ప్రాంతానికి చెందిన తమలపాకుల పెరుమాళ్లు, యశోదమ్మల కుమార్తె కుమారిని 2006లో పెళ్లి చేసుకున్నాడు. పట్టణంలోని రాజావీధిలో భార్యతో కలసి వేరు కాపురం పెట్టాడు. పట్టణ సమీపంలోని ఓ కర్మాగారంలో పనిచేస్తూ జీవనం సాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో స్థానికంగా నివశించే వదిన వరుసైన ఓ మహిళతో వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం భార్యకు తెలిసింది. వదినతో ఇలా తిరగడం మంచిది కాదంటూ దండించింది. ఇది భార్యాభర్తల మధ్య వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో 2008 అక్టోబరు 28వ తేదీన దీపావళి పండుగ సందర్భంగా సురేష్ అమ్మానాన్నలు స్వగ్రామానికి వెళ్లగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సురేష్ భార్య కుమారిని కొట్టి, గొంతు నులిమి హత్య చేశాడు.
ఈ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే, కుమారి తల్లిదండ్రులు మాత్రం అల్లుడు తమ కుమార్తెను హత్య చేశారనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేయగా, నెల్లూరు ఏడో అదనపు జిల్లా జడ్జి గుర్రప్ప విచారించి... సురేష్ హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.1,500 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.