మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే ఆరోపణతో ఒక వ్యక్తి సొంత భార్యను కడతేర్చాడు. ఈ దారుణ ఘటన పంజాబ్‌లో గురువారం వెలుగు చూసింది. మృతురాలు.. తన బంధువుల ఇంటికి వెళ్లగా.. అక్కడకు వెళ్లిన ఆమె భర్త పదునైన పెద్ద కత్తితో ఆమె కడుపులో పొడిచాడు. పలుమార్లు పొడిచి.. ఆపై పోలీసులకు లొంగిపోయాడు నిందితుడు. ఈ ఘటన స్థానికంగా అలజడి రేపింది.
వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌లోని గోరయ పట్టణంలో జశ్వంత్ సింగ్, కుల్విందర్ సింగ్ భార్యాభర్తలు. వీరికి పెళ్లై చాలాకాలం అయింది. నలభై ఏళ్ల కుల్విందర్ సింగ్.. మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని జశ్వంత్ సింగ్ పదే పదే గొడవ పడేవాడు.