కరోనావైరస్ ప్రారంభం నుండి జులై 16 వరకు నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేటి నుండి ప్రారంభమయ్యే విమాన సర్వీసులు ముందుగా అమెరికా, ఫ్రాన్సు బయలుదేరనున్నాయి. మరుసటి రోజు నుండి మరో దేశానికి ఈ విమాన సర్వీసులు తిరుగుతాయి.
మార్చి23 నుండి కరోనా వల్ల వాయిదాపడ్డ ఈ విమాన సర్వీసులు శుక్రవారం నుండి కొన్ని దేశాలలో ప్రారంభమవుతాయని కేంద్ర విమాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటించారు. అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులను అధిగమించి ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరితే అమెరికా, ప్రాన్సు దేశాలకు భారత్ నుండి విమాన సర్వీసులు రెగ్యులర్‌గా తిరుగుతాయి.