తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఏదో అయినట్టుగా కనిపిస్తుంది. ఆమె గత నెల 22వ తేదీ నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నా, ఆమె గురించిన సరైన సమాచారం చెప్పడం లేదని అభిమానులు ఆందోళనకు దిగుతున్న వేళ, మాజీ ముఖ్యమంత్రి పనీర్ సెల్వం సోమవారం ఉదయం ఆసుపత్రికి వచ్చారు.
జయలలిత ఆసుపత్రిలో ఉన్న వేళ, పాలనా బాధ్యతలను పరోక్షంగా చేపట్టిన ఆయన, మరో ఇద్దరు మంత్రులతో కలసి హడావుడిగా లోపలికి వెళ్లారు. ఆసుపత్రిలో జయలలిత నిచ్చెలి శశికళతో పనీర్ సెల్వం ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం.