కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ కుమారుడు కార్తీక్ గౌడ తనను ప్రేమ పేరుతో మోసం చేసి అత్యాచారం జరిపాడని కన్నడ హీరోయిన్ మైత్రేయ ఆరోపించిడమే కాకుండా ఇప్పుడు తనను కాకుండా మరో అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడని బెంగుళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిన విషయమే. దీనితో మైత్రేయ కేసు కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ పరువు జాతీయ స్థాయిలో బజారున పడేలా చేసేసింది. మైత్రేయ కేసుపై ఆయన చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ వ్యాఖ్యానించారు.
కాగా, నటి, మోడల్, మైత్రేయ.. కార్తీక్ గౌడ పైన పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు దీని పైన విచారణ జరుపుతున్నారు. సదానంద గౌడకు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.