భారతీయ నర్సులకు విపరీతమైన డిమాండ్.. రూ.20 లక్షల వేతనంతో బ్రిటన్‌కు..

శుక్రవారం, 1 జనవరి 2021 (10:39 IST)
విదేశాల్లో భారతీయ నర్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా, కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ వ్యాప్తంగా పారామెడికల్ సిబ్బంది కొరత నెలకొంది. ముఖ్యంగా నర్సుల కొరత తీవ్రంగా ఉంది. అదేసమయంలో భారత్ మాత్రం ఈ పరిస్థితి లేదు. దీంతో విదేశాల్లో భారతీయ నర్సులకు విపరీతమైన డిమాండ్ నెలకొనడంతో అనేక విదేశీ ఆస్పత్రులు భారీ వేతనంతో రిక్రూట్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ విషయాన్ని కర్నాటక ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ వెల్లడించారు. 
 
ఇందులోభాగంగా, తొలి విడతగా 1000 మంది నర్సులకు ఒకేషనల్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చి బ్రిటన్ పంపించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు కర్ణాటక రాష్ట్ర నైపుణ్య అభివృద్ధిశాఖ, బ్రిటన్‌కు చెందిన చెందిన నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎన్‌హెచ్ఎస్), హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లండ్ (హెచ్ఈఈ)ల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలిపారు. ఉద్యోగం పొందిన నర్సులకు వార్షిక వేతనం కింద రూ.20 లక్షలు లభిస్తుందని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఇదే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ముందుకు వస్తున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు