ఇటు ఏపీతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ ఈ ఎన్440కే వైరస్ వెలుగుచూసింది. అలాగే నోయిడాలో కూడా ఒక కోవిడ్ రీ-ఇన్ఫెక్షన్ కేసును కూడా గుర్తించారు. జూలై-ఆగష్టు మధ్య 6,370 మంది జన్యువులను విశ్లేషించగా.. దేశవ్యాప్తంగా రెండు శాతం మందిలో N440K మ్యుటేషన్‌ను గుర్తించారు. కాగా.. జులై-ఆగస్టు నెలల్లో ఆసియాలో ఎన్440కే రకం కరోనా వైరస్ ఆవిర్భవించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 5% జీనోమ్ సీక్వెన్సింగ్ చేయాలని కోవిడ్-19 టాస్క్‌ఫోర్స్ నిర్ణయం తీసుకుంది.