గుర్రంపై స్వారీ చేస్తూ పరీక్షా కేంద్రానికెళ్లిన రుద్రమదేవీ..

సోమవారం, 8 ఏప్రియల్ 2019 (17:59 IST)
సాధారణంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తుంటారు. అలాగే వారు పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి బస్సుల్లోనో, బైక్, సైకిల్ మీదనో వెళ్తుంటారు కదా. అలాంటిది కేరళకు చెందిన ఓ బాలిక ఏకంగా గుర్రంపై పరీక్ష కేంద్రానికి వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గర్ల్ పవర్ ఇదీ అంటూ ఆమె గుర్రంపై వెళ్తున్న వీడియోను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 
 
ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియో షేర్ చేస్తూ ఆమె తన హీరో అంటూ బాలికపై ప్రశంసలు కురిపించారు. 
 
ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా వైరల్ కావాలని ఆశించారు. కాగా బాలిక వివరాలను తనకు ఇవ్వాలని సోషల్ మీడియా వినియోగదారులను ఆనంద్ మహీంద్రా కోరారు. కేరళలోని త్రిసూర్‌ జిల్లాకు చెందిన ఓ బాలిక తన పదో తరగతి పరీక్షకు వెళ్తున్న వీడియోను మనోజ్‌ అనే వ్యక్తి పోస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు