పాస్‌పోర్ట్ అంటే ఎంత ముఖ్యమైన డాక్యుమెంట్. అది కేవలం గుర్తింపు కార్డు మాత్రమే కాదు. ఫలానా దేశానికి చెందిన వ్యక్తి అనే గుర్తింపును తెలుపుతుంది. అటువంటి పాస్‌పోర్ట్ కొత్తదైనా, పాతదైనా అందరూ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కేరళలో ఓ మహిళ మాత్రం తన భర్త పాస్ పోర్టును ఓ టెలిఫోన్ డైరెక్టరీలాగా మార్చేసింది.
ఈ కేరళ మహిళ కూడా ఆ కోవకే చెందినట్టుంది. అందుకే భర్త పాస్‌పోర్టులోని పేజీలను ఫోన్ నెంబర్లతో నింపేసింది. కేవలం ఫోన్ నెంబర్లు మాత్రమే కాదు.. చివర్లో కొన్ని పేజీల్లో కిరాణా సామాన్లు, సరుకులు, ఇతర వస్తువులు, చిట్టాపద్దులు కూడా రాసిపెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.